నారింజ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. చలికాలం సీజన్ లో ఇవి మనకు మార్కెట్‌లో ఎక్కువగా దర్శనమిస్తాయి
TV9 Telugu
నారింజ పండ్లను అనేక రకాలుగా తీసుకోవచ్చు. వీటిని నేరుగా అలాగే తినవచ్చు లేదా జ్యూస్ చేసి తాగవచ్చు. ఇతర పండ్లతో కలిపి సలాడ్ రూపంలోనూ తినవచ్చు. ఎలా తీసుకున్నా మంచిదే
TV9 Telugu
నారింజలో పోషకాలు దండిగా ఉంటాయి. నారింజలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు, పీచు ఉన్నందున ఇదెంతో మేలు చేస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా మెండుగా ఉన్న సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచి జలుబూ జ్వరాల వంటి సాధారణ సమస్యలు మొదలు ఇతర అనారోగ్యాలనూ రానివ్వదు
TV9 Telugu
గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి-9 విటమిన్ నారింజలో సహజ సిద్ధంగా దొరుకుతుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి
TV9 Telugu
నారింజరసం తాగడం వల్ల కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. చర్మం మృదువుగా, నిగారింపుతో ఉంటుంది. మధుమేహ రోగులు కూడా నారింజ పండ్లు భేషుగ్గా తినొచ్చు
TV9 Telugu
ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ఎనీమియాతో బాధపడుతున్న వారు ఈ రసం తీసుకోవడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది
TV9 Telugu
వీటిలోని పీచు జీర్ణప్రక్రియకు దోహదం చేస్తే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ పండ్లను కచ్చితంగా రోజూ తినాలని వారు చెబుతున్నారు