రోజుకు 2 అరటిపండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా..?
Krishna
29 May 2026
క్రికెటర్లు, జిమ్‌లో వర్కౌట్ చేసేవారు అరటిపండ్లు తినడం మనం చూస్తుంటాం. రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణమే 110 కేలరీల స్వచ్ఛమైన శక్తి లభిస్తుంది. ఇది రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
నేచురల్ బూస్టర్
అరటిపండ్లలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను క్లీన్ చేస్తుంది. రాత్రి భోజనం తర్వాత లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు వీటిని తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది.
జీర్ణ సమస్యలు
అరటిపండ్లలో పొటాషియం నిల్వలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని అదనపు సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. రోజూ రెండు అరటిపండ్లు తినడం ద్వారా బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. దీంతో గుండెపోటు రిస్క్ తగ్గుతుంది.
గుండెకు రక్షణ
డిప్రెషన్‌తో బాధపడేవారికి అరటిపండు ఒక మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం, శరీరంలోకి వెళ్లాక సెరోటోనిన్‌గా మారుతుంది. ఇది మూడ్‌ని మార్చి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
హ్యాపీ ఫుడ్
తీవ్రమైన శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి కండరాలు పట్టేయడం, నొప్పులు రావడం సహజం. అరటిపండ్లలోని మెగ్నీషియం, పొటాషియం కండరాలకు తగిన విశ్రాంతిని అందిస్తాయి.
కండరాల నొప్పులు
అరటిపండ్లలో ఉండే విటమిన్ బి6, పొటాషియం మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. క్రమం తప్పకుండా అరటిపండ్లు తినే వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి ఇతరుల కంటే మెరుగ్గా ఉంటాయని తేలింది.
మెదడు చురుకుదనం
శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అరటిపండ్లలో ఐరన్ కంటెంట్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
రక్తహీనత
అరటిపండ్లలో శరీరంలో క్యాల్షియాన్ని గ్రహించే శక్తిని పెంచే ఫ్రక్టోలిగోశాకరైడ్స్ అనే ప్రీబయోటిక్స్ వీటిలో ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాల నుండి క్యాల్షియం ఎముకలకు బాగా పట్టేలా చేస్తాయి. ఎముకలు బలంగా మారతాయి.