రోజూ ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే.. ఎంత మంచిదో!

01 November 2025

TV9 Telugu

TV9 Telugu

చిన్న చిన్న సమస్యలకు కూడా కొన్ని సార్లు తీవ్రంగా ఆలోచిస్తాం. కానీ, వాటి పరిష్కారాలు మాత్రం మన వంటింట్లోనే దొరుకుతాయి. అలా ఉపయోగించుకోగల వాటిలో లవంగాలు ఒకటి

TV9 Telugu

లవంగాలు వంటకాలకు రుచినీ, చక్కటి సువాసననూ ఇవ్వడమే కాదు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి. అవేంటంటే... 

TV9 Telugu

థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, ఫోలేట్‌ వంటి పోషకాలు లవంగాల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఒంట్లోని రోగనిరోధకశక్తినీ, శరీర వ్యవస్థల పనితీరునీ మెరుగుపరుస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. లవంగంలో ఉండే యూజెనాల్‌ హర్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది

TV9 Telugu

ఫలితంగా ఒత్తిడి, ఆందోళన అదుపులో ఉంటాయి. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తగ్గిస్తాయి

TV9 Telugu

కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ లాంటి ఖనిజాలెన్నో లవంగాల్లో దొరుకుతాయి. ఇవి పోషకలోపాన్ని నివారిస్తాయి. ఎముక బలాన్ని పెంచి, వాపులూ, నొప్పులను తగ్గించి ఉపశమనాన్ని ఇస్తాయి

TV9 Telugu

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీ మైక్రోబియల్‌ గుణాలు నోటి దుర్వాసనను అడ్డుకుంటాయి. పంటి నొప్పితో పాటు తలనొప్పినీ తగ్గిస్తాయి. రక్తంలోని చక్కెర నిల్వల్ని అదుపుచేస్తాయి

TV9 Telugu

రోజూ ఒక లవంగం తినడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా, ఇందులో బ్యాక్టీరియాను చంపే బాక్టీరిసైడ్ అంశాలు జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని ఇస్తాయి