ఈ జ్యూస్  షుగర్ బాంబ్‌తో సమానం.. రోజూ తాగొద్దు

28 June 2026

TV9 Telugu

TV9 Telugu

గ్లాసుడు చెరకు రసంలో సుమారు 25 నుంచి 30 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఇది దాదాపు ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల చక్కెరకు సమానం

TV9 Telugu

ఇందులో ప్రధానంగా సుక్రోజ్‌ ఉండగా, కొద్దిపాటి గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌ కూడా ఉంటాయి. చక్కెర ద్రవరూపంలో ఉండటం వల్ల అది రక్తప్రసరణలోకి చాలా వేగంగా చేరుతుంది

TV9 Telugu

దీంతో శరీరానికి తక్షణ శక్తి లభించి చల్లదన‌ అనుభూతి చెందుతారు. అందుకే వేసవిలో చెరకు రసం తాగిన వెంటనే ఉల్లాసంగా అనిపిస్తుంది. అయితే దీనిని రోజూ తీసుకోకూడదు

TV9 Telugu

చెరకు రసంలో పొటాషియం, పాలీఫినాల్స్‌ వంటి కొన్ని పోషకాలు కూడా ఉంటాయి. పొటాషియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది

TV9 Telugu

పాలీఫినాల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు వేడి వాతావరణంలో ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే చెరకు రసాన్ని ప్రతిరోజూ తీసుకోవడం అంత మంచిది కాదట

TV9 Telugu

మొత్తం చెరకు ముక్కలో ఉండే పీచు పదార్థం రసంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్‌ కూడా ఉండదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి

TV9 Telugu

రక్తంలో చక్కెర వేగంగా పెరగడం వల్ల కొంతసేపు అధిక శక్తి లభించినట్లు అనిపించినా, ఆ తర్వాత శక్తి స్థాయి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీంతో అలసట ఆవహిస్తుంది

TV9 Telugu

ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, మధుమేహం లేదా యాసిడ్‌ రిఫ్లక్స్‌ సమస్యలతో బాధపడుతున్న వారు చెరకు రసాన్ని తరచూ తీసుకోవడాన్ని నివారించడం మంచిది