హఠాత్తుగా టీ తాగడం పూర్తిగా మానేస్తే.. ఏం జరుగుతుందో తెల్సా?

14 May 2025

TV9 Telugu

TV9 Telugu

టీ అనే మాట వింటే చాలు.. ఎక్కడ లేని హుషారూ వస్తుంది. అలసట, నీరసం మాయమై రీచార్జయిపోతాం. కొందరు ఒకట్రెండుసార్లే తాగితే.. ఇంకొందరు గంటగంటకీ ఓ గుటక పడాల్సిందే

TV9 Telugu

అయితే కాఫీ, టీ అధిక వినియోగం మంచిది కాదనే మాట అనేకసార్లు వింటుంటాం కదూ! దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

చాయ్‌ కానీ కాఫీ కానీ అసలే మానేయమనడం లేం. కాకపోతే భోజన సమయంలో మంచిది కాదు. భోజనానికి గంట ముందు లేదా తర్వాత తాగడం బెటర్‌

TV9 Telugu

కొందరు ఆహారం తీసుకునేటప్పుడు కాఫీ, టీలు తాగితే త్వరగా అరుగుతుందని, శరీరంలో పేరుకున్న నూనెను కరిగించేస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు

TV9 Telugu

అదే టీ పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయట. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో నిర్విషీకరణను పెంచుతుంది. కెఫిన్ వ్యసనం నుంచి ఉపశమనం కలిగిస్తుంది

TV9 Telugu

టీలో ఉండే కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అదే టీ తాగడం మానేయడం వల్ల నిద్ర మరింత నాణ్యంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత శరీర సిర్కాడియన్ రిథమ్ మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది

TV9 Telugu

దీని వల్ల మీ నిద్ర రిఫ్రెష్‌గా అనిపించడం ప్రారంభిస్తుంది. టీలోని టానిన్లు కొంతమందిలో ఆమ్లత్వం లేదా మలబద్ధకానికి కారణమవుతాయి. అదే టీ పూర్తిగా వదిలేస్తే, జీర్ణక్రియ మెరుగుపడి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

టీ మానేస్తే చర్మం క్రమంగా సహజమైన మెరుపును పొందడం ప్రారంభిస్తుంది. కెఫిన్ తీసుకోవడం తగ్గించడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. ఇది చర్మానికి తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మొటిమలను తగ్గిస్తుంది. చర్మం శుభ్రంగా కనిపిస్తుంది