ఖాళీ కడుపుతో ఉల్లి తింటే ఏమవుతుందో తెలుసా?

27 May 2025

TV9 Telugu

TV9 Telugu

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి మరి.. ముఖ్యంగా చక్కెర స్థాయి నియంత్రణ.. మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో మంచిది. ఎందుకంటే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, ఇన్సులిన్‌ సెన్సిటివిటీని పెంచే రసాయనాలు ఇందులో ఉన్నాయి

TV9 Telugu

దీనిలో తక్కువ కొవ్వులు, పీచు పదార్థాలు మెండుగా ఉండి బరువు పెరగకుండా చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి.. ఉల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని త్వరగా రానివ్వవు. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే సల్ఫర్‌ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది 

TV9 Telugu

నలభైల్లో వచ్చే ఎముకలు బోలువారడాన్ని తగ్గిస్తాయి. దీనిలోని ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఉల్లిపాయలో శీతలీకరణ లక్షణాలు వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో చెమటను తగ్గిస్తాయి

TV9 Telugu

ఉల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వేడి స్ట్రోక్‌ను నివారించడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలల్లో ఫైబర్, ప్రీబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి పేగులలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి

TV9 Telugu

ఉల్లిలో అధిక మొత్తంలో నీరు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. ఉల్లిలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి

TV9 Telugu

ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

TV9 Telugu

ఉల్లిపాయలో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు దీర్ఘకాలిక అనారోగ్యాలను అదుపులో ఉంచుతాయి

TV9 Telugu

సల్ఫర్‌ రక్తపోటునూ, చెడుకొవ్వులనూ తగ్గిస్తుంది. గుండెజబ్బులను రానివ్వకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే  విటమిన్‌-సి ఇన్‌ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది