చాలామంది భోజనం తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుంటూ ఉంటారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాల్లో అన్ని రకాల ఆహార పదార్థాలతోపాటు దీన్ని తప్పనిసరిగా పెడతారు
TV9 Telugu
హోటల్స్‌లోనూ భోజనం చివర్లో ప్రత్యేకంగా అందిస్తారు. ఇందుకు కారణం ఆహారం బాగా జీర్ణమవుతుందనే. సోంపు చాలా రుచిగా ఉండటమే కాదు ఔషధ గుణాలను కలిగి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది
TV9 Telugu
ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే సోంపు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన మసాలా దినుసుగా పరిగనిస్తారు. దీని వినియోగం అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
సోంపు తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధం అని నిపుణులు సైతం అంటున్నారు. దాని రుచి, వాసనకు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది
TV9 Telugu
సోంపు గింజలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
సోంపు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. సోంపు నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీర జీవక్రియను పెంచుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది
TV9 Telugu
సోంపును నానబెట్టి తినడం ద్వారా నోటి దుర్వాసన తొలగిపోతుంది. సోంపులో నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి
TV9 Telugu
సోంపు కళ్ళకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది