చాలా మందికి ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో స్పూన్ తేనె కలిపి తీసుకోవడం అలవాటు. అయితే వాస్తవానికి తేనెను రోజూ తీసుకోవచ్చు
TV9 Telugu
రోజూ ఉదయం పరగడుపునే 1 టీస్పూన్ మోతాదులో తేనెను తీసుకుంటుంటే అనేక లాభాలను పొందవచ్చు. తేనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది
TV9 Telugu
తేనెను రోజూ పరగడుపునే తీసుకోవడం మంచిది. ఈ క్రమంలోనే రోజూ తేనెను ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం
TV9 Telugu
తేనెను రోజూ తీసుకోవడం వల్ల పిత్తాశయం ఆరోగ్యంగా ఉంటుంది. పైత్య రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది
TV9 Telugu
తేనె ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. తేనెను పరగడుపునే తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
పొట్టలో అధికంగా యాసిడ్లు ఉత్పత్తి అయ్యే వారు, కడుపులో మంట, అజీర్తి, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు రోజూ తేనెను తీసుకుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది
TV9 Telugu
తేనెలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది
TV9 Telugu
రోగాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. తేనెలో సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని తీసుకుంటే బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు