గుడ్లు మంచి పోషకాలు కలిగిన ఆహారం. ఒక గుడ్డులో 6-7 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, విటమిన్ ఎ, విటమిన్ డి, బి విటమిన్లతో పాటు కంటికి మేలు చేసే కొలీన్, ల్యూటీన్, జియాగ్జాంతీన్ వంటి పోషకాలూ ఉంటాయి
TV9 Telugu
గుడ్డులోని కొవ్వు ప్రధానంగా పచ్చసొనలో ఉంటుంది. అందుకే కొందరు తెల్లసొన మాత్రమే తింటుంటారు. అయితే గుడ్లలోని కొవ్వు చాలావరకూ అన్‌సాచ్యురేటెడ్ రకాలకు చెందిందే
TV9 Telugu
ఇలాంటి రకం కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. కొందరికి గుడ్లు పడకపోవచ్చు. వీటిని తింటే అలర్జీ రావొచ్చు. సుమారు 2% మంది పిల్లల్లో గుడ్డు అలర్జీ కనిపిస్తుంటుంది
TV9 Telugu
కానీ వీరిలో సగం మంది ఐదేళ్లు వచ్చేసరికి గుడ్డును తట్టుకునే సామర్థ్యం సంతరించుకుంటారు. పదహారేళ్లు వచ్చేసరికి 70% మంది తట్టుకుంటారు. గుడ్లలోని ఓవల్బుమిన్, ఓవోట్రాన్స్‌ఫెరిన్, లైసోజోమ్ వంటి ప్రొటీన్లు పడకపోవటం వల్ల అలర్జీ తలెత్తుతుంటుంది
TV9 Telugu
అప్పుడు దద్దు, వాపు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరు పిల్లల్లో గుడ్లను తిన్న 48 గంటల తర్వాత విరేచనాలు, వాంతి, కడుపు నొప్పి వంటివి వస్తుంటాయి
TV9 Telugu
ఇవి గుడ్డును తట్టుకోలేకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులే గానీ అలర్జీ కాదు. పిల్లల్లో రోగనిరోధకశక్తి పరిపక్వమయ్యాక.. అంటే దాదాపు ఏడాది వయసులో గుడ్డును తినటం అలవాటు చేస్తే అలర్జీ తలెత్తకుండా చేయొచ్చు
TV9 Telugu
గుడ్లను ఉడికించి తింటే తేలికగా జీర్ణమవుతాయి. కొందరు పచ్చి గుడ్లను తింటే బలమని భావిస్తుంటారు. ఒకవేళ వాటిల్లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టయితే ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది
TV9 Telugu
దీంతో తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, తీవ్ర జ్వరం రావొచ్చు. అందువల్ల గుడ్లను ఉడికించి, అట్టుగా వేసుకొని తినటమే శ్రేయస్కరం