ఉడికీ ఉడకని గుడ్డు తింటే ఏమవుతుంది?

21 November 2025

TV9 Telugu

TV9 Telugu

గుడ్డు ఆరోగ్యానికి వెరీగుడ్‌ అన్నది అందరికీ తెలిసిందే. బ్యాలెన్స్‌ డైట్‌కి ఇది పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌. ఇందులో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి

TV9 Telugu

ఆరోగ్యంగా ఉండాలని భావించేవాళ్లు, బరువుని పెంచుకోవాలని, నిలుపుకోవాలని కోరుకునేవాళ్లకు ఎప్పుడూ గుడ్డు అవసరమే

TV9 Telugu

అయితే గుడ్డుని ఏ రూపంలో తింటే రుచితోపాటు ఎక్కువ పోషకాలు అందుతాయనే సందేహం అందరికీ ఉండేదే. ఈ సందేహాన్ని తీర్చేందుకు అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ ఓ అధ్యయనం నిర్వహించింది

TV9 Telugu

వండిన తర్వాత గుడ్డు భౌతిక, రసాయన స్థితిలో మార్పులతోపాటు రుచి, పోషకాల పరిమాణాన్ని, జీర్ణక్రియలో ఎంజైముల ప్రభావం వల్ల శరీరానికి ఆ పోషకాలు అందే గుణాన్ని ఈ సంస్థ అధ్యయనం చేసింది

TV9 Telugu

జీర్ణకోశ నిపుణుల సహాయంతో నిర్వహించిన ఈ అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. బాగా ఉడికించిన గుడ్డు, కొద్దిపాటిగా వేడి వల్ల ఉడికీ ఉడకనట్టుగా ఉండే గుడ్డు, ఆమ్లెట్‌లో ఉండే పోషకాలు, జీర్ణ వ్యవస్థ గ్రహించే సామర్థ్యాన్ని పరిశోధకులు విశ్లేషించారు

TV9 Telugu

ఆమ్లెట్‌ జీర్ణవ్యవస్థకు అంత తేలికగా లొంగదు. బాగా ఉడికించిన, కొంచెం ఉడికించిన గుడ్డులో ఉండే ప్రోటీన్ల కంటే ఇందులో 37 శాతం ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి

TV9 Telugu

బాగా ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్‌తో పోలిస్తే కొద్దిగా ఉడికించిన గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అన్ని విషయాల్లో పరిశీలిస్తే ఈ రెండింటి కన్నా కొద్దిగా ఉడికించిన గుడ్డే మేలు

TV9 Telugu

కొద్దిగా ఉడికించిన గుడ్డు కన్నా.. బాగా ఉడికించిన గుడ్డును జీర్ణం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. బాగా ఉడికించిన, కొద్దిగా ఉడికించిన, ఆమ్లెట్‌లలో విటమిన్‌ ఎ సమానంగానే ఉంటుది