మజ్జిగలో కరివేపాకు వేసి తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

02 May 2025

TV9 Telugu

TV9 Telugu

ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి చల్లని మజ్జిగను ఇవ్వడం మన తెలుగు వారి సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వెనుక ఎండల దాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడే ఒక చక్కటి ఆలోచన ఉంది

TV9 Telugu

వేసవిలో మండుతున్న ఎండల తాకిడికి ఒళ్లంతా నిరసంతో ఉంటుంది. వేడి, ఉక్కపోతల కారణంగా మనుషులు తోటకూర కాడల్లా వాడిపోతుంటారు. ఇలాంటప్పుడు పెరుగుతో చేసిన పదార్థాలను, లస్సీ, మజ్జిగలు చేసే మేలు అంతా ఇంతా కాదు

TV9 Telugu

ఇవి తాగడం వల్లన పోయిన ప్రాణం లేచొచ్చిన్నట్లు అనిపిస్తోంది. వేసవిలో మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే పెరుగు, మజ్జిగ తాగడానికి చాలా ఇష్టపడతారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు కూడా అద్భుతంగా ఉంచుతుంది

TV9 Telugu

మజ్జిగలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్ వంటి అనేక ఖనిజాలు ఉంటామి. ఇందులో జీర్ణవ్యవస్థకు మేలు చేసే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి

TV9 Telugu

అందరికీ తెలిసినట్లుగా వేసవిలో మజ్జిగ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కరివేపాకు వేసిన మజ్జిగ మీరెప్పుడైనా తాగారా? వీటితో ఎన్నో ఉపయోగాలున్నాయి..

TV9 Telugu

మజ్జిగలో కరివేపాకు వేసి తాగడం వల్ల కరివేపాకులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. మజ్జిగలోని ప్రోబయోటిక్స్ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది

TV9 Telugu

ఇది బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం జుట్టుకు పోషణనిచ్చి జుట్టును బలంగా చేస్తుంది. కరివేపాకు జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

TV9 Telugu

 ఎండిన కరివేపాకులను చూర్ణం చేసి సాదా మజ్జిగలో కలపవచ్చు. దీన్ని తాజాగా ఉపయోగించాలనుకుంటే పచ్చి కరివేపాకును ముక్కలుగా కోసి, మజ్జిగలో కలిపి తాగవచ్చు