శీతాఫలం విత్తనాలు మింగితే ఏమవుతుందో తెలుసా?

07 November 2025

TV9 Telugu

TV9 Telugu

ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. సాధారణంగా ఈ పండ్లు సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య ఎక్కువగా లభిస్తాయి

TV9 Telugu

ఎంతో రుచికరంగా ఉండే సీతాఫలాలు ఆరోగ్యానికీ ఎంతో అవసరం. ఇందులో ఎ, సి, బి6 వంటి విటమిన్లతో పాటు కాపర్, పొటాషియం, పీచు.. వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి

TV9 Telugu

పైగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా. ఈ మధుర ఫలం చాలా బలహీనంగా ఉండి.. ఏ పని చేయడానికీ శరీరం సహకరించని వారికి ఒంట్లో శక్తిని అమాంతం పెంచేస్తుంది

TV9 Telugu

ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు విశ్రాంతినివ్వడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ ఖనిజం గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. శరీరానికి చలువ చేయడంతో పాటు రక్తహీనత సమస్య నుంచి రక్షిస్తుంది

TV9 Telugu

ఆహారం త్వరగా జీర్ణం కావట్లేదా? అయితే సీతాఫలం తినడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కాపర్ మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవడంలో సహాయపడుతుంది

TV9 Telugu

అయితే కొందరు ఈ పండు తినేటప్పుడు పొరబాటున దాని విత్తనాలు మింగేస్తుంటారు. అయితే శీతాఫలం ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన దాని విత్తనాలు మాత్రం ఆరోగ్యానికి హాని కలిగాస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా శీతాఫలం విత్తనాలు తినడం వల్ల కళ్ళకు, అంటే దృష్టికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒకటి, రెండు విత్తనాలు మింగితే ఏం కాదు. అదే ఎక్కువ మొత్తంలో దీని విత్తనాలు మింగడం అంత మంచిది కాదు

TV9 Telugu

దీని గింజలను మెత్తగా చేసి మీ జుట్టుకు రాసుకుంటే చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఈ గింజల పొడిని పేస్ట్ లా చేసి చర్మానికి రాసుకుంటే ప్రకాశవంతంగా మారుతుంది