రాగి పాత్రలో ఉంచిన పాలు విషంతో సమానం.. తాగారో బండి షెడ్డుకే!

15 May 2025

TV9 Telugu

TV9 Telugu

మన దేశంలో పూజ కోసం చాలా పురాతన కాలం నుంచి రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ లోహంతో తయారు చేసిన పాత్రలో ఉంచిన నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది

TV9 Telugu

నేటి కాలంలో ఇది చాలా ట్రెండ్‌లో ఉంది. రాగి పాత్రలో ఉంచిన నీరు అమృతంతో సమానమని ప్రస్తుత కాలంలో యువత నుంచి వృద్ధుల వరకూ అందరూ రాగి పాత్రలను వినియోగిస్తున్నారు

TV9 Telugu

అయితే మీకు తెలుసా.. రాగి పాత్రలో ఉంచిన పాలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు

TV9 Telugu

రాగి పాత్రల్లో ఉంచి నీళ్లు తాగగలిగినప్పుడు.. రాగి పాత్రలో ఉంచిన పాలు ఎందుకు తాగకూడదనే డౌట్‌ మీకు వచ్చిందా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

TV9 Telugu

నిజానికి, పాలను రాగి పాత్రలో ఉంచినప్పుడు, పాలలో ఉండే ఆమ్లం, రాగి లోహం మధ్య ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇది పాలు విరిగిపోవడానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఇది ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది

TV9 Telugu

పాలను రాగి పాత్రలో ఉంచినప్పుడు, లాక్టిక్ ఆమ్లంతో లోహం చర్య జరపడం వల్ల H2 హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది. దీంతో పాలు విషంగా మారతాయి

TV9 Telugu

ఇలా రాగి పాత్రలో ఉంచిన పాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది ఒక రకమైన ఫుడ్ పాయిజనింగ్ లాంటిదే

TV9 Telugu

అలాగే రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగావారు.. అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మరసం జోడించకూడదని గుర్తుంచుకోండి. ఇది వాంతులు, వికారం కూడా కలిగిస్తుంది. ఇది కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతుంది