మంచిదని గుమ్మడి విత్తనాలు అతిగా తిన్నారో.. మీ కథ కైలాసానికే!
28 June 2025
TV9 Telugu
TV9 Telugu
ఎవరైనా బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారు... వేసవిలో వడియాలు పట్టుకుంటారు. లేదంటే మజ్జిగ పులుసులో వేస్తారు. కొందరు హల్వా, ఆగ్రా పేఠా...వంటి స్వీట్లూ చేస్తారు. చాలామంది మాత్రం ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మం ముందు కడతారు
TV9 Telugu
బూడిదగుమ్మడి పాదు ఇంటి పెరట్లో ఉంటుంది. కానీ కాయల్ని వడియాలు పట్టుకోవడానికి తప్ప ఇంక దేనికీ వాడరు సరికదా, దానం ఇస్తే పుణ్యం వస్తుందనుకుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు
TV9 Telugu
అప్పట్లో శూద్రులు దీన్ని తింటే మరణదండన విధించేవారట. ఎందుకంటే- బూడిద గుమ్మడిలోని గుణాలు మెదడు పనితీరుని పెంచుతాయి. అంటే- దీనివల్ల తెలివితేటలు పెరుగుతాయని నాటి సంప్రదాయ వైద్యులకి తెలుసన్నమాట
TV9 Telugu
కూష్మాండం అనీ పిలిచే ఈ కాయను దిష్టి పేరుతో గుమ్మం ముందు కడుతుంటారు. అలా కట్టడంవల్ల దుష్టశక్తులు రావనీ చెబుతారు. కొన్ని గిరిజన తెగల్లో దీనికి ప్రాణం ఉందని భావించి, మేకలూ కోళ్ల బలులకు బదులుగా గుమ్మడికాయలానే దీన్నీ పగులగొడతారు
TV9 Telugu
అయితే గుమ్మడి ఆరోగ్యానికి కూడా భలేగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుమ్మడి కాయ లోపట ఉండే గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో రోగాలను నయం చేయవచ్చు. కానీ మంచిదని భావించి అతిగా తీసుకుంటే అమృతం కూడా విషంగా మారుతుంది
TV9 Telugu
ఈ విషయంలో గుమ్మడి గింజలకు ఎలాంటి మినహాయింపు లేదు. ఈ విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి. అలాగే గుమ్మడి గింజలను అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందిలో బరువు పెరగవచ్చు
TV9 Telugu
గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కొంతమందిలో అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విత్తనాలను అధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన గొంతు నొప్పి, దగ్గు కూడా వస్తుంది
TV9 Telugu
ఇప్పటికే తక్కువ రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తినకపోవడమే మంచిది. గుమ్మడి గింజల పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వీటిని సరిగ్గా తీసుకోవడం ఒక్కటే మార్గం