బెండతో జర భద్రం.. వీటితో కలిపి తిన్నారో కాలకూట విషమే!

23 September 2025

TV9 Telugu

TV9 Telugu

విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీఆక్సిడెంట్లు తదితర ఆరోగ్యకరమైన పోషకాలెన్నో బెండకాయల్లో పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించి, మెనోపాజ్‌ తర్వాత వచ్చే ఎముకల బలహీనతను తగ్గించి, హృద్రోగాన్ని దరికిరానివ్వదు

TV9 Telugu

ముఖ్యంగా ఎ, సి, కె విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం తదితర ఖనిజ లవణాలు బెండకాయలో పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో పొందొచ్చు

TV9 Telugu

అయితే దీన్ని ఆహారంలో తీసుకోవడానికి ఇష్టపడనివారు ఈ ప్రయోజనాలకు దూరమైనట్లే. బెండతో పలా, సాంబార్, ఫ్రైస్ వంటి వివిధ వంటకాలను తయారు చేసుకోవచ్చు

TV9 Telugu

క్రమం తప్పకుండా బెండ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే బెండ ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ దీనిని కొన్ని రకాల ఆహారాలతో కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు 

TV9 Telugu

ముఖ్యంగా బెండతో పాలు కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. ఎందుకంటే అందులో ఉండే ఆక్సలేట్లు పాలతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి

TV9 Telugu

బెండతో పుల్లని పెరుగు తినకూడదు. నిమ్మ, టమోటా వంటి పుల్లని ఆహారాలతో బెండను కలిపి తినడం వెంటనే మానుకోవాలి

TV9 Telugu

అలాగే కాకరకాయ, బెండకాయలను కూడా కలిపి తినకూడదు. ఎందుకంటే వాటిని తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి

TV9 Telugu

బెండ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ టీ తాగకూడదు. అందులోని టానిన్ కంటెంట్ బెండకాయలోని ఐరన్ కంటెంట్ శోషణను నిరోధిస్తుంది