వంటలలో ఎన్ని రకాల పదార్ధాలు కలిపినా.. ఉప్పు వేయకుంటే రుచి రాదు. వంట్లో ఉప్పు పాత్ర అంత కీలకం మరి. ఎందుకంటే ఇది ఆహారాన్ని రుచికరంగా మారుస్తుంది
TV9 Telugu
అయితే రుచి కోసమని ఉప్పు అపరిమితంగా తీసుకుంటే మాత్రం చిక్కులు తప్పవు. ఉప్పు ఎల్లప్పుడు మితంగా తీసుకుంటేనే అది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది
TV9 Telugu
ఎక్కువ ఉప్పు తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల ఆహారంలో ఉప్పు తీసుకోవడం పరిమితంగా తీసుకోవాలి
TV9 Telugu
అంతేకాకుండా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి
TV9 Telugu
ముఖ్యంగా కడుపు ఉబ్బరం, పాదాలు లేదా వేళ్లలో వాపు, నిరంతర తలనొప్పి, రక్తపోటు పెరగడం, తరచుగా దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి
TV9 Telugu
అధిక రక్తపోటు, తరచుగా తలనొప్పి వంటి లక్షణాలు మీరూ ఎదుర్కొంటుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. ఇవి అధిక ఉప్పు తీసుకోవడం కాకుండా ఇతర కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది
TV9 Telugu
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు వస్తుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది
TV9 Telugu
రోజుకు 5 గ్రాముల ఉప్పు తినడం అనువైనది. ఇది శరీరానికి 2000 మిల్లీగ్రాముల సోడియంను సరఫరా చేస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి