కూరల్లో పసుపు ఎక్కువైనా ఇబ్బందే.. మీ కిడ్నీలు గోవిందా!
27 January 2025
TV9 Telugu
TV9 Telugu
ఆరోగ్యకరం అని ఏదైనా అతిగా వాడడం మనలో చాలామందికి అలవాటు. ఇదే అనర్థాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కూరల్లో వాడే పసుపు విషయంలోనూ ఇది వర్తిస్తుందని చెబుతున్నారు
TV9 Telugu
పసుపును ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే పసుపు పైత్య రసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహకరిస్తుంది
TV9 Telugu
అయితే పసుపు మోతాదు పెరిగితే పైత్య రసం ఎక్కువగా ఉత్పత్తవుతుంది. ఫలితంగా ఆమ్లాల మోతాదు కూడా పెరిగి జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఇక గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఈ పరిస్థితి కొన్నిసార్లు పేగుల్లో అల్సర్లకూ కారణమవుతుందట
TV9 Telugu
ఇప్పటికే బ్లడ్ చిక్కగా ఉండటం వల్ల మందులు తీసుకుంటున్న వారు పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. అలాగే ఏ రకమైన శస్త్రచికిత్సకు ముందు పసుపు తినకూడదు. ఎందుకంటే ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది
TV9 Telugu
పసుపులో ఆక్సలేట్‌లు ఉన్నందున, కిడ్నీ సమస్యలు ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం, రక్తహీనత ఏర్పడుతుంది
TV9 Telugu
కొందరికి పసుపు వల్ల అలర్జీ రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే పసుపు తీసుకోవడం మానేయాలి