పనస తొనలు తిన్నాక విత్తనాలు విసిరేస్తున్నారా? ఆగండాగండీ..

15 July 2025

TV9 Telugu

TV9 Telugu

మరే పండుకూ లేనంత చక్కటి పరిమళం పనసది. ఆ వాసన పీలిస్తేనే కడుపు నిండినట్లుంటుంది. అంతేనా.. రుచిలో అమృతం,. పోషకాలు అమూల్యం..

TV9 Telugu

పనసపండుతో మరేదీ సాటి రాదు కదూ! ఆ వాసన, రుచీ అంత పసందుగా ఉంటాయి. దీంతో పాయసం, పకోడీ, పుట్టు, థోరన్, అప్పం, జామ్, హల్వా, కేక్, బర్గర్, స్మూథీ, చిప్స్‌.. ఇలా ఎన్నెన్నో వంటలు చేయొచ్చు

TV9 Telugu

వంటలేకాదు పండిన పనస తొనలు తింటుంటే ఎంత రుచిగా ఉంటాయో మాటల్లో చెప్పలేం. వేసవిలో అధికంగా పనస పండ్లు దొరుకుతాయి. పనస తినడానికి రుచికరంగా ఉండటమేకాకుండా.. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వనకూడుతాయి

TV9 Telugu

పనసతొనలు తినటం వల్ల శరీరానికి మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, పీచు, రిబోఫ్లేవిన్, ఎ, సి విటమిన్లు విస్తారంగా అందుతాయి. పనస తొనలేకాదు దీని విత్తనాలు కూడా తినవచ్చని చాలా మందికి తెలియదు

TV9 Telugu

పనస గింజల్లో ప్రోటీన్ అధికమొత్తంలో ఉంటాయి. ఇవి శరీర నిర్మాణం, కణాల మరమ్మత్తులో సహాయపడుతుంది. ఇది శాఖాహారులకు మంచి ప్రోటీన్ ఎంపిక. పనస గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. వాటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

TV9 Telugu

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. పనస గింజలు రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. ఈ గింజల్లో ఇనుము ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది

TV9 Telugu

పనస గింజలు చర్మానికి, జుట్టుకు మంచివి. వీటిలోని జింక్, ఐరన్, ప్రోటీన్ జుట్టు నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయి. చర్మ కాంతిని పెంచుతాయి. పనస గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి

TV9 Telugu

వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరం వివిధ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. పనస గింజలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. వీటిని ఉడికించి తినవచ్చు