మనం సాధారణంగా అరటిపండ్లు తిని వాటి తొక్కలను పారేస్తుంటాం. ఈ పండు తొక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి తొక్క చర్మ సంరక్షణలో భలే ఉపయోగపడుతుంది
TV9 Telugu
శుభ్రమైన ముఖానికి అరటిపండు తొక్క లోపలి భాగంతో అయిదు నిమిషాలు మృదువుగా రుద్దండి. ఆపై కొద్దిసేపు అలా వదిలేసి, చల్లని నీటితో కడిగేయాలి
TV9 Telugu
తరవాత మాయిశ్చరైజర్ రాస్తే సరి. ఇది నైట్ మాస్క్‌లా పనిచేస్తుంది. ఈ తొక్కలో చిన్న ముక్క తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి అరచెంచా చొప్పున ఫ్రెష్ క్రీమ్, తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసినా ప్రయోజనం ఉంటుంది
TV9 Telugu
దీన్ని స్క్రబ్‌లానూ వాడొచ్చు. ఈ తొక్క మీద కొద్దిగా పంచదార, తేనె వేసి ముఖానికి రుద్దితే సరి. అయిదు నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి, మాయిశ్చరైజర్ రాయాలి. ఇది మృతకణాలను తొలగించేస్తుంది
TV9 Telugu
అరటి తొక్క మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అరటి తొక్క పేస్ట్ ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
TV9 Telugu
అరటి తొక్కల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో ట్రిప్టోఫాన్, విటమిన్ బి6 నిరాశ లక్షణాలను తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
TV9 Telugu
హృదయ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి అరటి తొక్కలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది
TV9 Telugu
అరటి పండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్, ఎండవేడి వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడతాయి. అరటి తొక్కలోని బి6, బి12 విటమిన్లు చర్మసమస్యలను దూరం చేసి నిగారింపు తెస్తాయి