ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే..!
26 November 2025
TV9 Telugu
TV9 Telugu
ఉప్పు వేయకుండా ఏ వంటకమూ పూర్తి కాదు. ప్రతి వంటకంలోనూ ఉప్పు కచ్చితంగా ఉండాల్సిందే. ఉప్పు వల్ల కూరలకు ప్రత్యేక రుచి వస్తుంది
TV9 Telugu
అయితే చాలా మంది రోజూ కావల్సిన దాని కన్నా అధిక మొత్తంలో ఉప్పును తింటుంటారు. రోజుకు మనకు 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. కానీ చాలా మంది 8 నుంచి 10 గ్రాముల వరకు ఉప్పును తింటున్నారు
TV9 Telugu
ఉప్పును అధికంగా తినడం వల్ల అనేక తీవ్ర వ్యాధులు ఒంట్లో తిష్ట వేస్తాయి. అయితే చాలా మందికి తాము ఉప్పును అధికంగా తింటున్నామని తెలియదు
TV9 Telugu
ఉప్పు అధికంగా తింటుంటే శరీరం మనకు కొన్ని లక్షణాలు, సంకేతాలను ఇస్తుంది. శరీరంలో ఉప్పు అధికంగా ఉంటే సోడియం స్థాయిలు పెరుగుతాయి. ఈ క్రమంలో కిడ్నీలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో ఎన్ని నీళ్లు తాగిన దాహంగా ఉంటుంది
TV9 Telugu
అధిక ఉప్పు తినేవారిలో సోడియం అధికంగా ఉంటుంది. కనుక శరీరం తరచూ వాపుకు గురవుతుంది. ఈ లక్షణం కనిపిస్తున్నా కూడా ఉప్పును అధికంగా తింటున్నట్లే
TV9 Telugu
ఉప్పును అధికంగా తింటే శరీరంలోని ద్రవాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడి, తలనొప్పి వస్తుంది
TV9 Telugu
సోడియం ప్రభావం ఎముకలపై కూడా పడుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి. అలాగే ఉప్పును అధికంగా తింటే తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట ఇలా ఎక్కువగా జరుగుతుంది
TV9 Telugu
మీకు షుగర్ లేకపోయినా తరచూ మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం వస్తుందంటే మీరు ఉప్పును అధికంగా తింటున్నట్లే. బీపీ పెరుగుతుంది. ఇలా పలు లక్షణాలను గమనించడం ద్వారా మీరు ఉప్పును అధికంగా తింటున్నారో లేదో గ్రహించొచ్చు