ఉప్పుతో ముప్పు.. ఈ లక్షణాలు కనిస్తే మీరెక్కువగా తింటున్నట్లే!
21 October 2025
TV9 Telugu
TV9 Telugu
ఉప్పు లేని కూర నోటికి రుచించదు. అందుకే వంటకాలకు ఉప్పు తగలాల్సిందే. కానీ ఉప్పు మితిమీరితే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు వైద్య నిపుణులు
TV9 Telugu
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. మీరు మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారని చెప్పే సంకేతాలు ఇవే
TV9 Telugu
మధుమేహం సమస్య లేనప్పటికీ మీరు తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లయితే మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నట్లే. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో యూరిన్‌కి వెళుతుంటే మాత్రం ఆహారంలో ఉప్పు వాడకంపై ఓ కన్నేయాలి
TV9 Telugu
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయులు పెరిగి నీటి స్థాయుల సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా ఎక్కువ దాహం వేస్తుంది
TV9 Telugu
అదీకాక ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.. శరీరంలో నీటి స్థాయులు తగ్గి దాహం వేయడానికి ఇదీ ఓ కారణం
TV9 Telugu
శరీర భాగాల్లో వాపు రావడమనేది సాధారణంగా హైబీపీ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా పాదాల్లో నీటి నిల్వ పెరిగిపోయి ఉబ్బుతాయి. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఇలాంటి సమస్యల నుంచి క్రమంగా బయటపడచ్చంటున్నారు నిపుణులు
TV9 Telugu
మోతాదుకు మించి ఉప్పును తీసుకోవడం వల్ల క్యాల్షియం స్థాయుల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో ఎముకలు బలహీనమవుతాయి. ఫలితంగా తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువగా వస్తాయి