వేసవిలో మండుటెండల నుంచి ఉపశమనం పొందాలంటే పుచ్చకాయకు మించిన పండు మరొకటి లేదు. దాదాపు 95 శాతం నీటిని నింపుకొన్న ఈ సీజనల్ ఫ్రూట్‌లో శరీరానికి చలువనిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
పుచ్చకాయలో విటమిన్లు A, C, B6, K, మాంగనీస్, బీటా-కెరోటిన్, పొటాషియం, భాస్వరం, జింక్, రాగి, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు, ఫైబర్, సహజ చక్కెర, లైకోపీన్, అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి
TV9 Telugu
పుచ్చకాయలేకాకుండా పుచ్చకాయ జ్యూస్ కూడా బలేగా ఉంటుంది. ఇందులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
TV9 Telugu
వేసవిలో చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో పుచ్చకాయ జ్యూస్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది దాదాపు 92% నీటిని కలిగి ఉంటుంది దీని కారణంగా ఇది శరీరాన్ని నిర్జలీకరణం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
పుచ్చకాయ జ్యూస్‌లో సహజ చక్కెర ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వేడి సమయంలో అలసటను తొలగించడంలో ఇది సహాయపడుతుంది
TV9 Telugu
పుచ్చకాయ జ్యూస్‌లో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ఇది జిడ్డుగా ఉన్న చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
పుచ్చకాయ జ్యూస్‌లో తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం ఉంటుంది. ఇది చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. తద్వారా బరువు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
పుచ్చకాయలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీన్ని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది