ఇవి ఆకులు కాదు అమృతం.. ఖాళీ కడుపుతో రెండు తిన్నారంటే..!
12 June 2025
TV9 Telugu
TV9 Telugu
ఆయుర్వేదంలో వేపని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. పగటిపూట వేపచెట్టు నీడలో విశ్రమించేవారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారని చరక సంహిత చెబుతోంది. సిద్ధవైద్యం లోనూ వేప చెట్టు ప్రస్తావన ఉంది
అందుకే పిల్లలకు చికెన్‌పాక్స్, మీజిల్స్ లాంటి జ్వరాలు సోకినప్పుడు పక్కమీద వేపాకు పరుస్తారు. బియ్యం పురుగుపట్టకుండా నిల్వ చేసే డబ్బాలో వేపాకులు వేస్తారు. వేపాకు పసరుని పాములూ కీటకాల కాటుకి మందుగా వాడేవారు
TV9 Telugu
వేపాకు, పువ్వుల పచ్చడిని ఊరగాయలాగా చేసుకోవడం చాలా ప్రాంతాల్లో ఉంది. గులాబీ పువ్వులతో చేసినట్లు వేపపువ్వుతోనూ గుల్కంద్ తయారుచేస్తారు. వేపాకు ఎండబెట్టి చేసే టీ తాగితే గొంతునొప్పి, జలుబు, అజీర్తి లాంటి సమస్యలు రావని పెద్దలు నమ్ముతారు
TV9 Telugu
వేప ఆకులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక వ్యాధులను నియంత్రించవచ్చు. వేప ఆకులలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి
TV9 Telugu
ముఖ్యంగా జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులను నయం చేస్తుంది. వేప ఆకులు డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి
TV9 Telugu
వేప ఆకులు పేగుల్లో హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. కడుపులోని ఆమ్ల సమతుల్యతను కాపాడుతాయి. ఇది మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది
TV9 Telugu
వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు, తలపై చర్మ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. అకాల తెల్ల జుట్టుని నివారిస్తుంది. వేప ఆకులు దంతాలు, చిగుళ్ళకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగుళ్ల వాపు, కావిటీస్, దుర్వాసనను తొలగిస్తాయి