వేప చెట్టు (అజాదిరాచ్టా ఇండికా) ఎక్కపడితే అక్కడ సులభంగా లభించే ఔషధ చెట్టు. ఇది ఔషధ గుణాల నిధి. పలు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
ఇప్పుడైతే ఏదో సంప్రదాయంగా ఉగాది పచ్చడిలో కాస్త వేపపువ్వు’ అనుకుంటున్నాం కానీ నిజానికి బహురూపాల్లో వేప మనకు తెలియకుండానే మన జీవితాల్లో భాగమైపోయింది
TV9 Telugu
పల్లెటూరి వైద్యశాలగా పేరుగాంచిన వేప సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. అమ్మవారు, తట్టు నుంచి మొటిమలను తగ్గించడం, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వరకు రకరకాల చర్మ రోగాలను చిటికెలో తరిమేస్తుంది
వేప రెమ్మల్లో ఆల్కలాయిడ్స్, రెసిన్స్, గమ్, ఫ్లోరైడ్, సల్ఫర్, టానిన్స్, ఆయిల్స్, సపొనిన్స్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాల్స్, కాల్షియం లాంటివి పుష్కలంగా ఉంటాయి. మేకలకే కాకుండా మామూలు పాడి జంతువులకు కూడా వేపాకు మంచి పౌష్టికాహారం
TV9 Telugu
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా ఇది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేప ఆకులను ముల్తానీ మట్టి లేదా గంధపు పొడితో కలిపి ముఖానికి పూయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి
TV9 Telugu
వేప ఆకుల పేస్ట్‌ను తలకు రాసుకోవడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తద్వారా చుండ్రు తగ్గుతుంది. తలపై దురద ఎక్కువగా ఉంటే, వేప ఆకులను మరిగించి, చల్లబరిచి, ఆ నీటితో జుట్టును శుభ్రం చేసుకుంటే ఇట్టే ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
వేప పుల్లతో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలను ప్రకాశవంతం చేసి, నోటి సమస్యల నుంచి కాపాడుతుంది. చిగుళ్ళు బలంగా ఉంటాయి. వేప ఆకుల పొగ దోమలు, కీటకాల నుంచి రక్షిస్తుంది