నల్ల మిరియాలతో మేలెంతో.. చిటికెడైనా చాలు!

24 October 2025

TV9 Telugu

TV9 Telugu

ఆహారంలో ఉప్పు మోతాదు పెరగడం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. సాల్ట్‌తోపాటు డైనింగ్‌ టేబుల్‌పై ఉండే మిరియాల పొడి గురించి మాత్రం పెద్దగా ఎవరూ ప్రస్తావించరు

TV9 Telugu

ఆ పదార్థం మన ఆరోగ్యానికి ప్రయోజనకారియేనా అన్న ప్రశ్న సంధిస్తే ‘ఔను’ అనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆరోగ్య రక్షణలో మిరియాలు పాత్ర తక్కువేమీ కాదు

TV9 Telugu

మసాలా దినుసుల్లో మిరియాలది రారాజు పాత్ర. ఇది వంటకాలకు ఘాటైన రుచిని ఇస్తుంది. దీన్ని అనేకమంది అమితంగా ఇష్టపడుతుంటారు

TV9 Telugu

మిరియాల్లో పైపరైన్‌ పదార్థం ఉంటుంది. ఇది ఘాటైన వాసనను సమకూర్చింది. శరీరంలోని హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే యాంటీఆక్సిడెంట్‌గానూ ఇది పనిచేస్తుంది

TV9 Telugu

అనారోగ్యకర ఆహారం, ఎండలో ఎక్కువగా తిరగడం, మద్యపానం, ధూమపానం వంటివాటి వల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ పెరుగుతుంటాయి. ఫలితంగా కణాలు దెబ్బతింటాయి

TV9 Telugu

దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకొస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్‌, ఉబ్బసం, మధుమేహం వంటి రుగ్మతలకు ఇది కారణమవుతుంది

TV9 Telugu

ఫ్రీ ర్యాడికల్స్‌ను పైపరైన్‌ నిర్వీర్యం చేస్తుంది. పైపరైన్‌లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి. రొమ్ము, ప్రోస్టేట్‌, పెద్ద పేగు క్యాన్సర్‌ కణాల పునరుత్పత్తిని పైపరైన్‌ తగ్గించినట్లు, క్యాన్సర్‌ కణాలు చనిపోయేలా చేస్తుంది 

TV9 Telugu

ముఖ్యంగా ట్రిపుల్‌ నెగెటివ్‌ రొమ్ము క్యాన్సర్‌’ చికిత్సలో పైపరైన్‌ అత్యంత సమర్థమైందని పరిశోధకులు సైతం తేల్చారు. క్యాన్సర్‌ కణాల్లో బహుళ ఔషధ నిరోధకతను తగ్గించే సామర్థ్యమూ పైపరైన్‌కు ఉంది. ఇలాంటి నిరోధకత వల్ల కీమోథెరపీ సమర్థత తగ్గుతుంది