పచ్చి మిర్చి కారంగా ఉంటుందని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. అయినా ఇవి వంటల్లో ప్రత్యేక రుచిని ఇస్తాయని ఒకటో రెండో వేస్తుంటారు
TV9 Telugu
వీటిని చట్నీల్లో, పప్పు, మసాలా వంటకాల్లో, పచ్చళ్లులలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. నిజానికి పచ్చి మిర్చి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి గురించి తెలిస్తే పచ్చి మిర్చిని అస్సలు దూరం పెట్టరు
TV9 Telugu
పచ్చిమిర్చి, ఆహారానికి కారపు రుచిని తెస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. పచ్చిగా తినడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. ఇందులో కాల్షియం, బి6, మెగ్నీషియం, ఐరన్, డైటరీ ఫైబర్, పొటాషియం కూడా అధిక మొత్తంలో ఉంటుంది
TV9 Telugu
రెండు మూడు పచ్చి మిరపకాయలను రోజూ ఆహారంతో పాటు సలాడ్ లాగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
పచ్చి మిరపకాయలను తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటమేకాకుండా, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కూడా పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
పచ్చి మిరపకాయలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అందువల్ల, దీని వినియోగం కీళ్ళు, కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది
TV9 Telugu
పచ్చి మిరపకాయ వినియోగం రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు పచ్చి మిరపకాయలను తప్పనిసరిగా తినాలి. ఇందులోని విటమిన్ సి చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది