క్యాన్సర్‌ను తరిమికొట్టే ఎర్రపండు.. మీరు తింటున్నారా?
05 July 2025
TV9 Telugu
TV9 Telugu
దాదాపు అన్ని వంటకాల్లో విరివిగా ఉపయోగించే టొమాటోల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిలో విటమిన్లు ‘ఎ’, ‘సి’, పొటాషియం, క్యాల్షియం.. వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
ఈ కాయగూరలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది. ఇవేకాక ఇంకా టొమాటోలో మరిన్ని ఆరోగ్య రహస్యాలు దాగినున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
టమాట! ఈ పేరు వినని వారు దాదాపు ఉండరు. ప్రతి ఇంట్లో ఈ కూరగాయ లేకుండా వంట సాధ్యం కాదు. ఇది ఏ వంటకానికైనా ప్రత్యేకమైన రుచిని జోడిస్తుంది
TV9 Telugu
అంతే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. టమోటాలలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది
వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత నుంచి రక్షించడంలో టమాటాలు సహాయపడతాయి. టమోటాలు క్యాన్సర్‌ను నివారించడంలో కూడా సహాయపడతాయి
TV9 Telugu
క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలోనూ ఇవి సహాయపడతాయి. ఇవి ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు, కొలొరెక్టల్ వంటి పలు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి
TV9 Telugu
టమాటాలలో విటమిన్ కె, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి మీరూ టమాటాలను ప్రతి వంటకంలోనూ మర్చిపోకుండా వాడటం అలవాటు చేసుకోండి