నీరు ఎక్కువగా ఉన్న కొబ్బరి బోండం ఇలా ఉంటుంది..

22 May 2025

TV9 Telugu

TV9 Telugu

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు. ఇది ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే మార్కెట్‌లో వీటి ధర కూడా డిమాండ్‌కు తగ్గట్టు చాలా అధికంగా ఉంటుంది

TV9 Telugu

ఒక కొబ్బరి బోండం ధర రూ.60 నుంచి రూ.80 పలుకుతుంది. అంత ధర చెల్లించినప్పటికీ లోపల నీరు మాత్రం చాలా తక్కువ ఉంటుంది

TV9 Telugu

మార్కెట్లో వీటిని కొనుగోలు చేసే సమయంలో ఏ విధంగా అధికంగా నీరు ఉన్న కొబ్బరి బోండం కొనుగోలు చేయాలో నిపుణుల మాటల్లో మీ కోసం..

TV9 Telugu

కొబ్బరి నీళ్లకు బహుళ ప్రయోజనాలు అందిస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రెటెడ్‌గా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

కొబ్బరి నీళ్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మొటిమలు, నల్లటి మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది

TV9 Telugu

అయితే కొబ్బరి బోండం కొట్టకుండానే అందులో ఎంత నీరు ఉందో తెలుసుకోవడానికి.. ముందుగా ఆకుపచ్చ రంగులో ఉన్న కొబ్బరి బోండం ఎంచుకోవాలి

TV9 Telugu

మార్కెట్లో గోధుమ రంగు కొబ్బరి బోండాలు కూడా ఉంటాయి. ఈ రంగుది కొబ్బరికాయగా మారడం ప్రారంభించిందని సూచిస్తుంది. అటువంటి వాటిల్లో నీళ్లకు బదులు కొబ్బరి అధికంగా ఉంటుంది

TV9 Telugu

అలాగే కొంచెం గుండ్రంగా ఉండే కొబ్బరి బోండం కొనడానికి ప్రయత్నించాలి. కొబ్బరి బోండం కొబ్బరికాయగా మారినప్పుడు దాని సైజ్‌ పొడవుగా మారుతుంది. ఇలాంటి వాటిల్లో నీళ్లు తక్కువగా ఉంటాయి