రాత్రి నిద్రకు అరగంట ముందు పాలు, ఖర్జూరం కలిపి తాగారంటే..!
23 January 2025
TV9 Telugu
TV9 Telugu
ఖర్జూర పండును చూడగానే నోరూరుతుంది. ఇది రుచికరమైందే కాదు, ఆరోగ్యదాయిని కూడా. ఖర్జూరంలోని ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్ వంటి సరళ పిండి పదార్థాలు సత్వరం శక్తినిస్తాయి. టానిన్లనే యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫెక్షన్లు, వాపు, రక్తస్రావ నివారణకు తోడ్పడతాయి
TV9 Telugu
బీటా కెరటిన్, ల్యుటీన్, జియాగ్జాంతిన్ అనే రుచికారక యాంటీఆక్సిడెంట్లు విశృంఖల కణాలను (ఫ్రీ రాడికల్స్) అడ్డుకుంటాయి. ఇలా పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి కొంతవరకు రక్షిస్తాయి
TV9 Telugu
ఇందులోని జియాగ్జాంతిన్ వృద్ధాప్యంలో రెటీనాలోని మాక్యులా క్షీణించకుండానూ కాపాడుతుంది. కణాలకు పొటాషియం అత్యవసరం. ఇది ఖర్జూరంలో దండిగా ఉంటుంది. ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుంది
TV9 Telugu
ఇలా గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు చేస్తుంది. ఇందులో ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్‌ను ఎదుర్కొనే గుణాలూ ఉన్నాయి. పీచు, ఫెనాల్ తరగతి ఆమ్లాలు సైతం ఎక్కువగా ఉంటాయి
TV9 Telugu
ఖర్జూరాలను రోజూ పాలతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలను గోరువెచ్చని పాలలో కలుపుకుని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
ఇది నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరంతో పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి, సి, కె, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. ఇలా తాగితే ప్రోటీన్ అధికంగా శరీరానికి అందుతుంది
TV9 Telugu
మలబద్ధకం ఉన్నవారు రాత్రిపూట గోరువెచ్చని పాలు, రెండు ఖర్జూరాలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. కండరాలు బలంగా మారుతాయి. అలాగే మంచి నిద్రకూడా పడుతుంది
TV9 Telugu
పాలు, ఖర్జూరాన్ని కలిపి తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. పైగా కండరాల నొప్పి, అలసట వంటి మొదలైన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు