నోరూరించే సమోసా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే మీ హార్ట్ బ్రేక్ పక్కా!
05 September 2025
TV9 Telugu
TV9 Telugu
వేడి వేడి ఘుమఘుమలాడే సమోసా అంటే ఇష్టపడని వారుండరు. చల్లని సాయంత్రాల్లో.. చిరుజల్లులు కురుస్తున్న సమయాల్లో గరంగరంగా ఏదైనా తినాలనిపిస్తే టక్కున గుర్తొచ్చేది సమోసానే...
TV9 Telugu
ప్రాంతాలను బట్టి దీని పేరు, రుచి మారినా దాదాపు అందరూ అమితంగా ఇష్టపడి తినే వంటకమిది. అనేకమందికి ఇది ఫుడ్‌కాదు.. ఒక ఎమోషన్
TV9 Telugu
చాలా మందికి ఇష్టమైన వీధి ఆహారం కూడా ఇదే. దేశంలోని ప్రతి వీధిలోనూ దీనిని అమ్ముతారు. దాని త్రిభుజాకార ఆకారం, లోపలి రుచికరమైన బంగాళాదుంపల కర్రీ తిన్నవారెవరూ మర్చిపోలేరు
TV9 Telugu
మన దేశంలో ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ సమోసా.. నిజానికి మన వంటకం కాదట. ఇది దాదాపు 2.5 వేల కిలోమీటర్ల దూరం నుంచి మన దేశానికి తీసుకువచ్చారు
TV9 Telugu
అసలు సమోసాను మొదట ఇరాన్‌లో తయారు చేసేవారు. వ్యాపారులు దీనిని క్రీపూ10వ నుంచి క్రీశ 1వ శతాబ్దం మధ్యలో మన దేశానికి తీసుకువచ్చారు. ఇరాన్‌లో దీనిని మాంసం నింపి తయారు చేసేవారు
TV9 Telugu
అయితే మన దేశంలో మాత్రం దీనిని బంగాళాదుంపలతో తయారు చేసేవారు. ఇరాన్‌లో దీనిని సంబుసాగ్ అని పిలిచేవారు. అంటే 'నిండినది' అని అర్థం. కానీ మనదేశంలో దీని రుచి విపరీతంగా నచ్చేయడంతో దాని పేరు సంబుసాగ్ నుంచి సమోసాగా మారింది. అలా సమోసాకు ఆ పేరు వచ్చింది
TV9 Telugu
సమోసాను వివిధ దేశాల్లో, సమోసాను బోరిక్, సంబోసా, సముచా, సంబుక్సా, సుంబాసా, సంబుసాక్ వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. సమోసా ఇరాన్, భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని 25 దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది
TV9 Telugu
అయితే మన ఒక్క దేశంలోనూ ప్రతిరోజూ దాదాపు 6 కోట్ల సమోసాలు అమ్ముడవుతున్నాయి. సమోసాలలో కొవ్వు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. సమోసాను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది