ఇది అత్యంత ఖరీదైన ఉప్పు.. పావు కిలో కొనాలంటే ఆస్తులమ్మాల్సిందే!
28 January 2025
TV9 Telugu
TV9 Telugu
ఉప్పు లేని వంటింటిని మనం అస్సలు ఊహించలేం. ఎందుకంటే ఉప్పులేనిదే వంట పూర్తి కాదు కాబట్టి. స్వీట్స్ మినహాయిస్తే మిగతా పదార్థాలు ఏవైనా సరే ఉప్పు వేయకపోతే నోట్లో కూడా పెట్టలేం
TV9 Telugu
ఉప్పు తక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది. అందుకే ఆరోగ్యంగా ఉండటానికి పరిమిత పరిమాణంలో మాత్రమే ఆహారంలో ఉప్పు చేర్చుకోవాలి. అయితే చప్పదనం లేకుండా వంటకాలకు రుచినిచ్చే ఉప్పులోనూ రకరకాలు అందుబాటులో ఉన్నాయి
TV9 Telugu
సాధారణంగా ఉప్పు ఖరీదు చాలా చవక. కిలో రూ.10 నుంచి రూ.20 మించదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఉందనే సంగతి మీకు తెలుసా.. దీని ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెడతారు
TV9 Telugu
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు.. కొరియన్ వెదురు ఉప్పు. దీని ధర 250 గ్రాములు సుమారు 100 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.8500
TV9 Telugu
కొరియన్ వెదురు ఉప్పును తయారుచేసే ప్రక్రియ, దీని ప్రయోజనాలు కారణంగా ఇంత ఖరీదైనదిగా మారింది. ఈ ఉప్పు తయారీలో తొలుత సముద్రం ఉప్పును వెదురులో ప్యాక్ చేసి.. ఆ తరువాత అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చుతారు
TV9 Telugu
ఈ ప్రక్రియ కనీసం 9 సార్లు పునరావృతమవుతుంది. ఇలా వెదురును కాల్చే ప్రక్రియలో, అనేక ఖనిజాలు ఈ ఉప్పులోకి చేరతాయట. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
ఇలా తయారు చేసిన ఉప్పు అనేక వ్యాధుల నివారణలో ప్రయోజనకరంగా పని చేస్తుంది. ఈ వెదురు ఉప్పు నోటి పుండ్లు, చిగుళ్ళ వాపు, నొప్పి వంటి నోటి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది
TV9 Telugu
కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వాపు తగ్గించి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ ఆరోగ్యం, జీర్ణశక్తిని మెరుగుపరచడం, టాక్సిన్స్‌ను తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలున్నాయి
TV9 Telugu
వెదురులో ఉప్పు వేయించినప్పుడు, మొత్తం ప్రక్రియ తర్వాత దాని రంగు కూడా రిచ్ యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ముదురు రంగులోకి మారుతుంది. ఇది కొద్దిగా ఊదా రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని పర్పుల్ సాల్ట్ అని కూడా అంటారు