ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ ఇందులో పుష్కలంగా లభిస్తాయి
TV9 Telugu
పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఎ; ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయి
TV9 Telugu
జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లు తోడ్పడతాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుంది
TV9 Telugu
ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది. శరీరం, గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు గుడ్డులో అధిక మొత్తంలో ఉంటాయి
TV9 Telugu
ఇందులోని పోషకాల దృష్ట్యా చాలా మంది అల్పాహారంలో గుడ్లు తినడానికి ఇష్టపడతారు. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గుడ్లలో విటమిన్ బి12, ప్రోటీన్, కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
కానీ గుడ్లు ఖాళీ కడుపుతో తినాలా? వద్దా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖాళీ కడుపుతో గుడ్లు తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు
TV9 Telugu
ఇప్పటికే అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా ఖాళీ కడుపుతో గుడ్లు తినకూడదు. ఇది అలెర్జీలను పెంచుతుంది. గుడ్లలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఈ ప్రోటీన్ కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
అయితే రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తినాలని నిపుణులు అంటున్నారు. దీనివల్ల శరీరంలో ప్రోటీన్, విటమిన్ల లోపం తలెత్తదని చెబుతున్నారు