ఎప్పుడూ నీరసమేనా? తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే! 

25 September 2025

Samatha

 జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం  వర్క్ బిజీ వలన చాలా మంది, సరైన ఆహారం తీసుకోకపోవడం, స్ట్రెస్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది నీరసం, అలసట అంటూ ఇబ్బంది పడిపోతున్నారు.  యువతలో ఈ సమస్య ఎక్కుగా ఉంటుంది.

ఏ పనిచేసినా, కాసేపు నడిచినా సరే నీరసంతో సతమతం అవుతున్నారు. అయితే దీనికి ముఖ్యకారణం, టైమ్‌కి సరైన ఆహారం తీసుకోకపోవడమేనంట.

అయితే ఎలాంటి ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవడం వలన నీరసం వంటి సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చూద్దాం.

నీరసం, అలసటతో బాధపడేవారు తమ ఆహారంలో, మఖానా, నట్స్, సీడ్స్ తీసుకోవాలంట. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ శరీరానికి శక్తిని అందజేస్తాయి.

అదే విధంగా, మొక్కజొన్న కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయంట.

అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన అరటి పండు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. నీరసం వంటి సమస్య తగ్గుతుంది.

ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినడం వలన కూడా శరీరానికి శక్తి అందుతుంది. ఇది నీరసం , అలసట నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట.