బియ్యం పిండితో పూరీలు.. ఇలా చేస్తే అదిరిపోద్దీ అంతే!
17 october 2025
Samatha
ప్రతి ఒక్కరూ గోధుమ పిండి లేదా పూరీ పిండితో మాత్రమే పూరీలు చేసుకుంటారు. కానీ బియ్యం పిండితో కూడా టేస్టీ టేస్టీ పూరీలు చేయవచ్చునంట. అది ఎలా అంటే?
బియ్యం పిండి పూరీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన నూనె
ముందుగా స్టవ్ ఆన్ చేసి, అందులో ప్యాన్ పెట్టి, అందులో నీళ్లు పోసి, నువ్వులు, పసుపు చిటికెడు, ఉప్పు వేసి మరిగించాలి.
తర్వాత మరిగే నీటిలో బియ్యం పిండి వేసి, పిండి ముద్దలు కట్టకుండా, కలుపుతూ ఉండాలి, పిండి మంచిగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
పిండి చల్లారిందో లేదో చూసి, చల్లారిన తర్వాత ఆ పిండిని, పూరీలు చేసుకోవడానికి అనుగుణంగా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత వాటిని ఒక్కో ఉండను తీసుకొని పూరీలుగా చేసుకోవాలి. అలా మీరు కలపుకున్న పిండిని మొత్తం పూరీలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, డీ ఫ్రైకి కావాల్సిన నూనె పోయాలి. నూనె వేడి అయిన తర్వాత అందులో పూరీలు వేసి, వేయించుకోవాలి.
పూరీలు బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే అంతే వేడి వేడి బియ్యం పిండి పూరీలు రెడీ, మరి మీరు కూడా ట్రై చేసేయ్యండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కంటి నిండా , హాయిగా నిద్రపోవాలంటే, ఏవైపు పడుకోవాలో తెలుసా?
తమలపాకులు చేసే మేలు తెలుసా..?
పల్లీలతో పది ప్రయోజనాలు.. ఇది తెలిస్తే తింటూనే ఉంటారు!