అరటిపండు తిన్న తర్వాత వీటిని తిన్నారో.. మీ కథ కైలాసానికే!
07 March 2025
TV9 Telugu
TV9 Telugu
సీజన్లతో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ చౌకగా దొరికేది ఒక్క అరటి పండు మాత్రమే. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ ఇష్టపడి తింటారు
TV9 Telugu
అరటిపండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే వ్యాయామం చేసే వారు దీన్ని ఖచ్చితంగా తమ ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు
TV9 Telugu
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిని తినడం వల్ల కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది
TV9 Telugu
అయితే అరటి పండును తీసుకునే క్రమంలో చేసే కొన్ని పొరబాట్లు మనల్ని చిక్కుల్లో పడేస్తుంటాయ్. ముఖ్యంగా అరటి పండు తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. అవేంటంటే..
TV9 Telugu
అరటిపండు తిన్న తర్వాత పుల్లని పండ్లు తినకూడదు. అరటిపండు తిన్న తర్వాత పుల్లని పండ్లు తినడం వల్ల అజీర్ణం చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
అరటిపండు తిన్న వెంటనే చల్లటి నీరు తాగకూడదు. దీనివల్ల జీర్ణ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. అరటిపండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కూడా గొంతు నొప్పి వస్తుంది
TV9 Telugu
అలాగే అరటిపండు తిన్న తర్వాత వెంటనే పెరుగు తినకూడదు. ఇది జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. అరటిపండు తినడానికి కనీసం 1 గంట ముందు లేదా తరువాత మాత్రమే పెరుగు తీసుకోవాలి
TV9 Telugu
రాత్రిపూట సాధ్యమైనంతవరకు అరటి పండును తినకపోవడమే మేలు. అలా తీసుకోవడం వల్ల ఒక్కోసారి జలుబు లాంటి సమస్యలు దరిచేరే అవకాశం ఉంది