చల్లని సాయంత్రాల్లో గరంగరం సమోసా తినడం మీకూ ఇష్టమా?

16 July 2025

TV9 Telugu

TV9 Telugu

చిరుజల్లులు కురిసే చల్లని సాయంత్రాలప్పుడు... వేడివేడిగా సమోసా ఆరగిస్తే స్వర్గం దిగి రావాల్సిందే.. ఇదీ సమోసా మహిమ! దాదాపు ప్రతి ఒక్కరూ సమోసాలను ఇష్టపడుతారు

TV9 Telugu

పుట్టగొడుగులతో చేస్తే.. పొట్ట నిండాల్సిందే. చికెన్‌తో కలిపితే చిటికెలో ప్లేట్‌ ఖాళీ... ఇక కూరగాయలు కూరితే ఆవురావురుమనాల్సిందే... సమోసా దేనితో చేసినా దాని రుచికి సాగిలపడాల్సిందే

TV9 Telugu

చల్లని సాయంత్రాల్లో సమయాల్లో వేడివేడి ఏదైనా తినాలనిపిస్తే మొదట టక్కున గుర్తొచ్చేది సమోసానే. కానీ మీకు తెలుసా.. సమోసాలో అధిక మోతాదులో కేలరీలు, అధిక కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి

TV9 Telugu

ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. అందుకే రుచి సంగతి పక్కన పెడితే.. సమోసాలను తినడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

ముఖ్యంగా ఇది డయాబెటిస్ రోగులకు చాలా హానికరం. ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలాగే బరువు తగ్గుతున్నవారు, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నవారు కూడా సమోసాలకు దూరంగా ఉండాలి

TV9 Telugu

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అధిక కొవ్వు, అధిక చక్కెర కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సమోసా గుండెకు హాని కలిగిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారు అధిక కొవ్వు, అధిక చక్కెర కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సమోసా రక్తపోటు, గుండెకు హాని కలిగిస్తాయి

TV9 Telugu

నూనెలో వేయించిన సమోసాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది

TV9 Telugu

పైగా నూనె, పిండితో చేసిన వస్తువులు జీర్ణవ్యవస్థను నెమ్మదిస్తాయి. ఇప్పటికే గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉంటే, సమోసాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లలకు అప్పుడప్పుడు కొంచెం ఇవ్వవచ్చు, కానీ అది అలవాటుగా మారకూడదు. వీటి వల్ల ఊబకాయం, దంత సమస్యలు వస్తాయి