వీరికి అరటిపండ్లు విషంతో సమానం.. తిన్నారో కథ కైలాసానికే!
14 March 2025
TV9 Telugu
TV9 Telugu
ఏడాది పొడవునా దొరికేది, అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే- అది కచ్చితంగా అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో ఎంత చెప్పినా తక్కువే
TV9 Telugu
అరటిపండులో విటమిన్ సి, బి6, సహజ చక్కెర, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అరటిపండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యులు రోజుకొక్క అరటి పండు తప్పనిసరిగా తినాలని చెబుతుంటారు. కానీ కొంతమంది మాత్రం దీనిని అస్సలు తినకూడదు. ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు అరటిపండును ఆచితూచి తినాలి. ఇందులో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అయితే పరిమిత పరిమాణంలో తీసుకోవడం కొంతవరకు మంచిది
TV9 Telugu
అరటిపండులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారి ఆహారంలో ఇది తీసుకుంటుంటే బరువు తగ్గడానికి బదులు మరింత పెరుగుతారు. అందుకే పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి
TV9 Telugu
కొంతమందికి అరటిపండ్లు తింటే అలెర్జీ సమస్యలు వస్తాయి. దీని వలన చర్మంపై దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి. అలాంటి వారు అరటిపండ్లకు దూరంగా ఉండటమే మంచిది
TV9 Telugu
అరటిపండులో టైరమైన్ అనే మూలకం ఉంటుంది. ఇది మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. మీకు తరచుగా తలనొప్పి వస్తుంటే, అరటిపండ్లను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోండి
TV9 Telugu
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలున్న రోగులకు మరింత ప్రమాదకరం. కిడ్నీ సమస్యలున్నవారికి అధిక పొటాషియం హానికరం. కాబట్టి వీటిని పొరబాటున కూడా ముట్టుకోకూడదు