వీరికి బొప్పాయి జ్యూస్ వద్దండీ బాబూ..! ఎందుకంటే..
24 February 2025
TV9 Telugu
TV9 Telugu
బొప్పాయి... కొంతమంది ఈ పేరు వింటేనే మొహం తిప్పేస్తారు. కానీ ఈ పండు తింటే బోలెడన్ని లాభాలున్నాయి. ఈ పండులో బోలెడన్ని విటమిన్లు ఉంటాయ్. ముఖ్యంగా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
ఈ పండులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి పండులో ఉండే కెరోటినాయిడ్లూ, పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
బ్యూటీ క్రీమ్‌లు, బ్యూటీ లోషన్లు లాంటి సౌందర్య ఉత్పత్తుల్లోనూ బొప్పాయి వాడేస్తుంటారు. ఈ పండ్లనే కాదూ ఆకుల్నీ, విత్తనాలనూ ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారు
TV9 Telugu
బొప్పాయి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడానికి ఇష్టపడతారు. ఇందులో విటమిన్లు ఎ, సి మరియు కె, ఫోలిక్ ఆమ్లం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అయితే కొంతమంది బొప్పాయి జ్యూస్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
ఇప్పటికే మలబద్ధకం, ఆమ్లత్వం సమస్యలు ఉన్నవారు బొప్పాయి రసం తాగకూడదు. వీరు వైద్యుడిని సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బొప్పాయి జ్యూస్ తాగకూడదు
TV9 Telugu
బొప్పాయిలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. కిడ్నీ సమస్యలున్నవారు దీనిని తాగకూడదు
TV9 Telugu
రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునే వారు కూడా బొప్పాయి జ్యూస్ తాగకూడదు. దీనిని తీసుకునే ముందు వైద్యుడిని తప్పక సందర్శించాలి. లేదంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది