వీరు పాలకూర తిన్నారంటే యమలోకానికి పార్శిల్ పక్కా..!
16 February 2025
TV9 Telugu
TV9 Telugu
ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పాలకూర ఎంత పోషకాహారమో చూద్దాం. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పీచు, సోడియం, పొటాషియం, ఫోలిక్ ఏసిడ్, ఎ,సి,కె విటమిన్లు ఉన్నాయి
TV9 Telugu
ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉబ్బసం, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, టైప్ 2 డయాబెటిస్, మైగ్రేన్‌లను నిరోధిస్తుంది
TV9 Telugu
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయం రాదు. గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. పాలకూర తరచూ తినేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీరం ప్రశాంతంగా ఉంటుంది
TV9 Telugu
ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలుగుతుంది. పాలకూరలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నందున చర్మం కాంతిమంతంగా ఉంటుంది. ఇది క్యాన్సర్లను సైతం నిరోధిస్తుంది
TV9 Telugu
అయితే పాలకూర ఆరోగ్యానికి మేలు చేస్తున్నప్పటికీ.. కొంత మంది దీనిని తినడం హానికరం అంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా కీళ్ళు, ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడేవారు పాలకూర తినడం మంచిది కాదు. ఇందులో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. ఇవి డేంజర్
TV9 Telugu
అలాగే చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే పాలకూర తినకూడదు. ఇందులో హిస్టామిన్ ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల చర్మ అలెర్జీలు వస్తాయి
TV9 Telugu
పాలకూర అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో కడుపు సమస్యలు ఉన్నవారు పాలకూర తినకపోవడమే మంచిది
TV9 Telugu
అలాగే మూత్రపిండాల్లో రాళ్లు, బ్లడ్ క్లాట్స్ లాంటి సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇది మేలు కంటే కీడే చేస్తుంది. వాళ్లు దీన్ని వీలైనంత తక్కువ తినడమే మంచిది. పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం వీరికి హాని కలిగిస్తుంది