కర్బూజా ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!

08 May 2025

TV9 Telugu

TV9 Telugu

పండ్లన్నీ ఆరోగ్యదాయకమే. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే కర్బూజా.. ఎంత రుచిగా ఉంటుందో అంత మేలు చేస్తుంది. వేసవిలో లభించే ఈ సూపర్ ఫుడ్‌లో నీరు అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఇందులో పొటాషియం, ఫొలేట్, పీచు, ఎ, బి, బి1, బి3, బి5, బి6, సి, కె-విటమిన్లు, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాల్షియం ఉన్నాయి

TV9 Telugu

ఇది ఒంట్లో నీరు తగ్గకుండా, శరీరం పొడిబారకుండా కాపాడుతుంది. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. చర్మం నేవళంగా ఉంటుంది, ముడతలు పడదు. తరచూ కర్బూజ తినడం అలవాటు చేసుకుంటే కాలేయం సురక్షితంగా ఉంటుంది. దీంతో ఊబకాయం రాదు. కురులను సంరక్షిస్తుంది

TV9 Telugu

ముఖ్యంగా వేసవిలో ఒంటిని చల్లగా ఉంచడంలో కర్బూజా బలేగా పనిచేస్తుంది. అయితే కొన్ని సమస్యలున్న వారు దీనిని అస్సలు తినకూడదు. కర్బూజాలో సహజ చక్కెర ఉంటుంది. అందువల్ల దీనిని అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు దీనిని తినకూడదు

TV9 Telugu

అలాగే కిడ్నీ రోగులు అధిక పొటాషియం ఉన్న ఆహారాలు తక్కువగా తినాలి. కర్బూజాలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మూత్రపిండాలు పొటాషియంను ఫిల్టర్ చేయలేక సమస్యలను మరింత అధికం చేస్తుంది

TV9 Telugu

తక్కువ రక్తపోటు ఉన్నవారు కర్బూజా గింజలను తినకూడదు. ఎందుకంటే కర్బూజాలో చాలా పొటాషియం ఉంటుంది. ఇది తక్కువ రక్తపోటు ఉన్న రోగులకు హానికరం

TV9 Telugu

కర్బూజాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడేవారు కర్బూజా తినకూడదు. డ్రై ఫ్రూట్స్ అలెర్జీ ఉన్నవారు కర్బూజా గింజలను తినకూడదు 

TV9 Telugu

జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు కూడా కర్బూజా తినకూడదు. దీనివల్ల అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలు అధికం అవుతాయి