కాఫీతో ఈ ఆహారాలు తింటే బండి షెడ్డుకే..! బీ కేర్ ఫుల్..

18 July 2025

TV9 Telugu

TV9 Telugu

కప్పు కాఫీ తాగనిదే చాలామందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. బద్ధకాన్ని వదిలించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. ఇలా వివిధ కారణాలతో కాఫీని ఆశ్రయిస్తుంటారు

TV9 Telugu

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఇందులోని కెఫీన్‌ మన శరీరానికి హాని కలగజేస్తుంది. ఈ క్రమంలో కాఫీపై నియంత్రణ పాటించాలంటున్నారు నిపుణులు

TV9 Telugu

అలాగే కొంతమందికి కాఫీతో స్నాక్స్‌ తినే అలవాటు ఉంటుంది. అయితే ఇలాంటి వారు కొన్ని రకాల ఆహారాలను కాఫీ తాగే ముందు లేదా తర్వాత అస్సలు తీసుకోకూడదని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

నిజానికి, కాఫీలోని వివిధ పదార్థాలు ఆ ఆహారాలలోని పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. చాలా మంది ఉదయం టీ తాగినట్లే, కొంతమంది కాఫీని ఇష్టపడతారు. కాఫీ తాగడంలో ఎటువంటి సమస్య లేదు. కానీ కొన్ని ఆహారాలను కాఫీతో కలిపి తినకపోవడమే మంచిది

TV9 Telugu

ముఖ్యంగా ద్రాక్ష, నారింజ లేదా నిమ్మకాయల వంటి సిట్రస్ పండ్లను కాఫీతో కలిపి తినకూడదు. అలాగే పాలతో కాఫీ తాగడం మంచిది కాదు. పోషకాహార నిపుణులు పాల కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీ తాగడం మంచిది

TV9 Telugu

ఎందుకంటే పాలతో కాఫీ తాగడం వల్ల కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. అలాగే రెడ్ మీట్ తిన్న తర్వాత కాఫీ తాగకూడదు ఎందుకంటే ఇది మాంసం జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది

TV9 Telugu

అంతేకాకుండా ఇది మాంసంలోని ఐరన్‌ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఏదైనా వేయించిన ఆహారం తిన్న తర్వాత కూడా కాఫీ తాగడం అంత మంచిది కాదు.ఎందుకంటే వేయించిన ఆహారం తిన్న తర్వాత కాఫీ తాగడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది

TV9 Telugu

కాఫీని నట్స్‌తో కలిపి తాగడం ఎప్పుడూ మంచిది కాదు. ఇది ధాన్యాలలోని విటమిన్లు, ఖనిజాలను సరిగ్గా గ్రహించకుండా నిరోధిస్తుంది