నిద్ర లేవగానే ఈ పానీయం తాగితే కీళ్ల నొప్పులు మటాష్‌!

16 October 2025

TV9 Telugu

TV9 Telugu

నేటి కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. వీటి స్థాయిలు పెరగడం ప్రస్తుత రోజుల్లో సాధారణ సమస్యగా మారింది

TV9 Telugu

దాదాపు ప్రతి ఇంట్లో యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారున్నారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కానీ ఈ సమస్య 40 ఏళ్లలోపు కూడా వస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి

TV9 Telugu

ఇంట్లోనే తయారు చేసుకునే కొన్నిడ్రింక్స్‌ ఈ యూరిక్ యాసిడ్ సమస్యలను తగ్గించగలవు. వీటికి వాపును తగ్గించే సామర్థ్యం ఉంటుంది. ముఖ్యంగా అల్లం టీ యూరిక్ యాసిడ్ సమస్యలను చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది

TV9 Telugu

అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. గౌట్ నొప్పిని తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. దీనికి వాపును తగ్గించే సామర్థ్యం ఉంది

TV9 Telugu

నిమ్మ నీరు కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది

TV9 Telugu

ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఈ పానీయం బరువును తగ్గిస్తుంది. శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను తొలగిస్తుంది

TV9 Telugu

అలాగే ఉసిరిలోని విటమిన్ సి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆమ్లా రసం కలిపి తాగాలి. దీనివల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి

TV9 Telugu

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అలాగే నానబట్టిన మెంతుల నీళ్లు కీళ్ల నొప్పులను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి