ఆహా ఏమి రుచి.. భారతదేశంలోని టేస్టీ ఫేమస్ బిర్యానీలివే!

Samatha

4 july  2025

Credit: Instagram

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మరీ ముఖ్యంగా మన హైదరాబాదీ బిర్యానీ అంటే చాలు ఇది చాలా మంది ఫేవరెట్. 

అయితే హైదరాబాదే కాకుండా వివిధ రాష్ట్రల్లో కూడా బిర్యానీ అదిరిపోద్దంట.కాగా, ఏ రాష్ట్రాల్లో ఏ రకం బిర్యానీ ఫేమసో చూసేద్దాం.

నవాబుల వంటశాల నుంచి వచ్చేచాలా రుచికరమైన బిర్యానీ లక్నోబిర్యానీ, సుగంధ ద్రవ్యాలు సోంపు, దాల్చిన చెక్క మరియు కుంకుమ పువ్వుతో చేసే ఈ బిర్యానీ చాలా ఫేమస్ అంట.

పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే ఈ బిర్యానీకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుందంట.కోల్‌కతా బిర్యానీ రెసిపీలో బంగాళాదుంపలు, గుడ్లతో పాటు సుంగధ ద్రవ్యాలు ఉంటాయంట.

కేరళ రాష్ట్రంలోని తలసేరి బిర్యానీ కూడా చాలా అద్భుతమైన రుచిని ఇస్తుందంట. కేరళలోని మలబార్ ప్రాతం నుంచి వచ్చిన ఈ బిర్యానీ చాలా ఫేమస్.

ఇది సువాసనగల బాస్మతి రైస్, బంగాలదుంపలు, కీమాతో తయారు చేస్తారంట. ఇది డిన్నర్, లంచ్‌కు చాలా బాగుంటుందంట.

భట్కులి బిర్యానీ ఇది కర్ణాటకప్రాతంలో చాలా బాగా ప్రాచుర్యం పొందినది. ఈ బిర్యానీ రుచి అద్భుతంగా ఉంటుందంట.

ఇందులో ఎక్కువ ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, మాంసంతో తయారు చేస్తారంట. చాలా స్పైసీగా ఉండే ఈ బిర్యానీ తింటే ఆ రుచే వేరుంటుంది.

భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీనే. ఇది నిజాంల వంటశాలల్లో ఉద్భవించింది అంటారు.