టీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. టీని చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇంకొందరైతే ఏకంగా రోజులో రెండు లేదా మూడు సార్లు టీ తాగుతుంటారు.
అయితే కొంత మంది టీతో పాటు బిస్కెట్స్ తింటే, మరికొంత మంది టీతో పాటు రకరకాల స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ టీతో పాటు కొన్ని రకాల స్నాక్స్ అస్సలే తీసుకోకూడదంట. అవి ఏవో చూద్దాం.
టీతో పాటు ఎట్టి పరిస్థితుల్లో స్నాక్స్, తృణ ధాన్యాలు అస్సలే తీసుకోకూడదంట. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
టీ తాగిన వెంటనే పాలతో చేసిన ఆహారపదార్థాలు అస్సలే తీసుకోకూడదంట. ఇవి కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయంటున్నారు వైద్య నిపుణులు.
చాలా మంది ఉదయాన్నే ఎగ్ తింటుంటారు. అలాగే కొందరు టీతో పాటు ఎగ్ శాండ్ విచ్ తింటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. ఇది శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట.
ఉదయం టీలో చాలా మంది బ్రెడ్ తింటారు. అయితే కొందరు బ్రెడ్ బటర్ , టీ కలిపి తీసుకుంటారు. కానీ ఇలా తీసుకోవడం వలన వికారం, వాంతుల వంటి సమస్యలు ఎదురవుతాయంట.
టీ తాగిన వెంటనే అస్సలే నిమ్మకాయ లేదా నారింజ రసం వంటి జ్యూస్‌లు తీసుకోకూడదు. కెఫిన్, పుల్లని పదర్థాలు కలిపి తీసుకోవడం వలన దంతాలు దెబ్బతింటాయంట.
కొంత మది టీ తాగిన వెంటనే చాక్లెట్స్ లేదా ఐస్ క్రీమ్ తింటుంటారు. కానీ ఇలా టీతో పాటు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.