బీపీతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడని స్నాక్స్ ఇవే!

Samatha

8 august  2025

Credit: Instagram

వయసుతో సంబంధం లేకుండా చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అందుకే ఈ సమస్య ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు.

అయితే బీపీ సమస్య ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్నిరకాల ఫుడ్ తీసుకోకూడదంట. అది ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది స్నాక్స్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే బీపీ ఉన్న వారు కొన్నిరకాల స్నాక్స్‌కు కూడా దూరంగా ఉండాలంట.

బీపీ సమస్యతో బాధపడే వారు ఎట్టిపరిస్థితుల్లో వేయించిన స్నాక్స్, సాల్ట్ ఎక్కువగా ఉండేవి తీసుకోకూడదంట. దీని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.

అదే విధంగా, ఉప్పు ఎక్కుగా ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలంట. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది రక్తపోటు పెంచుతుందంట.

స్వీట్స్ కూడా వీలైనంత వరకు బీపీ పెషెంట్స్ తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అధికంగా బరువు పెరిగి, బిపీ కంట్రోల్‌లో ఉండదంట.

వేపుడు ఆహారాలకు, స్ట్రీట్ ఫుడ్‌కు చాలా వరకు దూరం ఉండాలంట. ఎందుకంటే? వీటిలో అధిక కొవ్వు ఉంటుంది. ఇది చెడు కొవ్వును పెంచుతుంది.

పాల పదార్థాలు, చీజ్, వెన్న, పాలతో చేసిన స్వీట్స్ కూడా అస్సలే తీసుకోకూడదంట. ఇందులో అధిక కొవ్వు ఉండటం వలన ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.