చలి కాలంలో తోట కూర తినడం మంచిదేనా?

16 october 2025

Samatha

చలి కాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి. అందుకే ఈ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు.

అయితే ఈ కాలంలో చాలా మంది ఆకు కూరలు ఎక్కువ తినడానికి ఇష్టపడతుంటారు. మరి ఈ చలికాలంలో ఆకు కూరలు లేదా తోట కూర తినడం మంచిదేనా? తెలుసుకుందాం.

తోట కూర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చాలా మంది తోటకూరను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇది వండితే చాలు ఒక ముద్దు ఎక్కువ తింటారు తప్ప తక్కువ మాత్రం తినరు.

అయితే అందరూ ఇష్టపడే ఈ తోటకూర చలికాలంలో ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంట. చలికాలంలో తోట కూర తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయంట.

ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణం ఎక్కువగా తేమగా ఉంటుంది. దీంతో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

జలుబు, తగ్గు, వంటి సమస్యలు దరి చేరుతుంటాయి. అంతే కాకుండా కొంత మంది వైరల్ ఫీవర్స్‌తో సతమతం అవుతారు. కొంత మంది విరేచనాల సమస్యతో బాధపడుతుంటారు.

అందువలన ఈ చలికాలం సమయంలో అస్సలే తోట కూర తినకూడదంట. ఈ సమయంలో తోట కూర తినడం వల విరేచనాలు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుందంటున్నారు నిపుణులు.