ఖాళీకడుపుతో నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి!
Samatha
01 September 2025
Credit: Instagram
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఖాళీ కడుపుతో తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు అని చాలా మంది ఉదయాన్నే నిమ
్మరసం తాగుతారు.
కానీ ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉన్నదంట. కాగా, దాని గురించి తెలుసుకుందాం.
ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం వలన అది బరువును తగ్గేలా చేయడమే కాకుండా, శరీరాన్ని టాక్సిన్ నుంచి శుభ్రం చేస్తుందని అందరూ
నమ్ముతారు.
కానీ ఇది శరీరానికి చాలా ముప్పు అంటున్నారు వైద్యులు. నిమ్మకాయలో ఉండే అధిక ఆమ్లత్వం, శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందంట.
ఇది ఎముకలలోని కొవ్వు తగ్గించి, వాటిని బలహీన పరచడమే కాకుండా, వయసు పెరిగే కొద్దీ ఎముకల సమస్యలు తలెత్తేలా చేస్తుందంట.
ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వలన ఇది కడుపులో ఆమ్లత్వం పెరిగేలా చేస్తుందంట. దీని వలన వికారం, గ్యాస్, కడుపులో మంట
కలుగుతుందంట.
అలాగే ఖాళీ కడుపుతో ఎక్కువ నీరు తీసుకోవడం వలన ఆస్కార్భిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి జరిగి, అధిక మూత్ర విసర్జన సమస్యలు తలెత్తుతాయంట.
అందువలన ఉదయాన్నే లెమన్ వాటర్ అధికంగా కాకుండా, పరిమిత మోతాదులో తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ గుండెను కాపాడే బెస్ట్ ఫుడ్ ఇవే!
ఆరోగ్యానికి వరం.. పాలకూర ఎందుకు తినాలో తెలుసుకోండి!
ఈ చిన్న పూలు గడ్డిపూలు కాదండోయ్.. ఆరోగ్యాన్నిచ్చే వి!