లాభాల పుట్ట.. బీరకాయ ఎందుకు తినాలో తెలిస్తే వదిలి పెట్టరు!

Samatha

3 February 2026

కూరగాయలలో చాలా మందికి బీరకాయ తెలుసు. కొంత మంది దీనిని ఎక్కువగా వండుకొని తింటే కొంత మంది దీనిని తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపరు.

కూరగాయలు

కానీ బీరకాయ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బీరకాయతో ఆరోగ్యం

బీర కాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని తినడం వలన అధిక ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉన్నదంట.

పోషకాలు పుష్కలం

బీరకాయలో నీటి శాతం , ఫైబర్ పీచు ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

జీర్ణక్రియ

అంతే కాకుండా బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిని తినడం వలన కడుపు నిండిన భావన కలిగి, ఆకలి నియంత్రణలో ఉంటుంది.

బరువు నియంత్రణ

బీరకాయలలో విటమిన్ ఏ, విటమిన్ సి, వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది కంటి చూపును మెరుగు పరచడంలో కీలకంగా వ్యవహరిస్తుందంట. కంటి చూపు మెరుగు పడేలా చేస్తుంది.

కంటి ఆరోగ్యం

అలాగే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వలన ఇది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అలాగే ముఖంపై మచ్చలు, మడతలు తగ్గించడానికి దోహదపడుతుంది.

చర్మ సౌందర్యం

డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, డయాబెటీస్ సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

డయాబెటీస్