నారింజతో ఆరోగ్యం.. ఈ పండు తింటే ఎన్ని లాభాలో..!

04 october 2025

Samatha

నారింజ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా వ్యవహారిస్తుంది. ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

ముఖ్యంగా నారింజ పండ్లలో లభించే విటమిన్ సి, కొలొరెక్టల్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

నారింజ పండ్లు రక్తపోటు నియంత్రించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తాయి. ఇందులో సోడియం ఉండదు కాబట్టి, వీటిని తినడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

నారింజ పండ్లలో అధిక పొటాషియం కంటెంట్ రక్తనాళాల సడలింపును  ప్రోత్సహించి, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుండె ఆరోగ్యానికి నారింజ పండ్లు చాలా మంచిది. ఇందులో ఫైబర్ అధిక స్థాయిలో ఉండటం వలన ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నారింజ రసం క్రమం తప్పకుండా తాగడం వలన ఇది  బరువు నియంత్రణకు సహాయపడుతుందంట. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన అనుభూతినిచ్చి ఆకలిని తగ్గిస్తుంది.

నారింజలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో చర్మం నిగారింపుగా, అందంగా తయారవుతుంది. అలాగే ఇది గాయాలను త్వరగా మానేలా చేస్తుంది.