పనస పండు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

31 August  2025

Credit: Instagram

పనస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని ఎక్కువగా తినడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయంట. అవి ఏవి అంటే?

పనస పండు పెద్ద పరిమాణంలో, మంచి రుచి, తీపిగా ఉంటుంది. ఇందులో 150 కేలరీలు, అనేక పోషకాలు ఉంటాయంట.

అలాగే పనస పండులో ప్రోటీన్స్, రిబో ఫ్లేవిన్‌లతో పాటు విటమిన్ సి కూడా అధిక మొత్తంలో ఉంటుందంట. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందంట.

పనస పండులో తక్కువ గ్లైసెమిక్ సూచి ఉండటం వలన ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షించి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. తప్పకుండా వారానికి రెండు సార్లు ఈ పండు తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, అలెర్జీ సమస్యతో బాధపడేవారు మాత్రం దీనిని అతిగా తినకపోవడమే మంచిదంట.

ఇక మంచి రుచి కోసం, ఏదైనా టేస్టీగా తినాలి అనుకునే వారు దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలా బెస్ట్ అంటున్నారు నిపుణులు.